అక్కినేని సినిమాల ప్రదర్శన
నాగేశ్వర్ రావు 100 ఏళ్ల
హైదరాబాద్ – తెలుగు సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన విలక్షణ, ప్రతిభావంతుడైన నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు. ఆయనతో పాటు నట శేఖర కృష్ణ, నందమూరి తారక రామారావు , కృష్ణం రాజు ఇలా ఎందరో తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తాజాగా అక్కినేని నాగేశ్వర్ రావు సెలబ్రేటింగ్ 100 ఇయర్స్ పేరుతో ఆయన అభిమానులు మరోసారి తను నటించిన సినిమాలలోని ఆణిముత్యాలను తిరిగి చూసే భాగ్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ పేరు పెట్టారు.
దేశ వ్యాప్తంగా ఏఎన్ఆర్ లైవ్స్ ఆన్ పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించి..మెప్పించిన ..జనాదరణ పొందిన సినిమాలను ప్రదర్శించనున్నారు.
వాటిలో దేవదాసు, మిస్సమ్మ, మాయా బజార్, ప్రేమాభిషేకం, సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమ్ నగర్ , తదితర పాపులర్ చిత్రాలు ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వర్ రావు అభిమానులకు పండుగేనని చెప్పవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు ఈ చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఏఎన్ఆర్ టీం వెల్లడించింది. ఇందుకు సంబంధించి సామాజిక వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం అక్కినేని ఫ్యాన్స్ మరోసారి తమ ఆరాధ్య నటుడిని చూసే భాగ్యం కలగనుంది.