NEWSANDHRA PRADESH

న‌టి జెత్వానీ ఆవేద‌న మంత్రి స్పంద‌న

Share it with your family & friends

అక్ర‌మ కేసులు ఎత్తివేయాల‌ని విన్న‌పం

అమ‌రావ‌తి – రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడిని ముంబైకి చెందిన న‌టి జెత్వానీ కాదంబ‌రి గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆమెను ఓదార్చారు మంత్రి. కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరారు న‌టి జెత్వానీ.

కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. నిందితులు ఎంతటి వారైనా చట్ట పరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌. ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోం మంత్రికి జెత్వాని కుటుంబం ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబయ్ నటి జెత్వానికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు.

ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు. భద్రత విషయంలో భయపడాల్సిన అవసరంలేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్షపడే వరకూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ అండగా ఉంటామన్నారు.

కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని ముంబయ్ నటి జెత్వాని తండ్రి హోంమంత్రితో అన్నారు. కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక, ఛానల్ ల గురించి ముంబయ్ నటి జెత్వాని హోంమంత్రికి భావోద్వేగంతో వివరించారు.