తలపతి విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టం – తారక్
స్పష్టం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కామెంట్
హైదరాబాద్ – తమిళ సినీ సూపర్ స్టార్ తలపతి విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. విజయ్ డ్యాన్స్ కు తాను వీరాభిమానని అన్నారు.
డ్యాన్స్ డ్యాన్స్ లాగా ఉండాలి అది ఫైట్ లేదా జిమ్నాస్టిక్స్ లాగా ఉండకూడదని అన్నారు తారక్. తనను ఎక్కువగా ఆకర్షించే నటుడు ఎవరైనా ఉన్నారంటే విజయ్ మాత్రమేనని పేర్కొన్నాడు. ఆయన డ్యాన్స్ చేసేటప్పుడు కష్ట పడుతున్నట్లు ఎప్పుడూ తనకు అనిపించ లేదని తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.
ఆయన డ్యాన్సులే కాదు నటన కూడా తనను విపరీతంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తలపతి విజయ్ గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తలపతి విజయ్ తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు.
తను నటించిన గోట్ మూవీ ఇటీవలే విడుదలైంది. భారీ జనాదరణ పొందింది. ఏకంగా రూ. 400 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తలపతి విజయ్ గురించి కితాబు ఇవ్వడం మరింత ఆసక్తిని కలిగించింది.
తరుచూ తను తలపతి విజయ్ తో మాట్లాడుతూ ఉంటానని, కానీ ఈ మధ్య మాట్లాడటం కుదరలేదని పేర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్.