బాబు దుష్ప్రచారం వైవీఎస్ ఆగ్రహం
తిరుమల ప్రసాదంపై ఆరోపణలు అబద్దం
అమరావతి – వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఏపీలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు అబద్దాలను, అడ్డగోలు ప్రచారం చేస్తున్నాడంటూ ఆరోపించారు.
తాను చైర్మన్ గా ఉన్న సమయంలో ఎలాంటి జంతు నూనెను శ్రీవారి లడ్డూ తయారీకి వాడ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలా వాడి ఉంటే ఎలాంటి విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వంలోకి వచ్చామని ఏది పడితే అది మాట్లాడితే కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం దారుణమన్నారు. గత మూడు 3 సంవత్సరాల నుండి స్వామి వారి నైవేద్యానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెయ్యితో సహా అన్ని ఆర్గానిక్ కు సంబంధించిన వాటినే వాడడం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన తమపై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.