NEWSANDHRA PRADESH

బాబు దిగ‌జారుడు రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

అమరావ‌తి – తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో జంతు మాంసానికి సంబంధించిన నూనెను వాడారంటూ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. పాల‌నా ప‌రంగా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకే త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

రాజ‌కీయంగా ద‌మ్ముంటే త‌న‌తో నేరుగా ఎదుర్కోవాల‌ని, కానీ ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం , నిరాధార‌మైన విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం త‌న స్థాయికి త‌గ‌ద‌ని పేర్కొన్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నేత , ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపణలను కొట్టి పారేశారు. దురుద్దేశ పూరిత మైనవని కొట్టి పారేశారు.

రాజకీయ సంబరం కోసం సీఎం నాయుడు ఏ స్థాయికైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాగా తిరుపతి ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు బీఫ్ ఫ్యాట్ , చేప నూనె వాడారని చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.