లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ చేపట్టాలి
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆమె స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుమల లడ్డుపై బాంబ్ పేల్చారు సరే , ఆయన వ్యవహారం చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇది చిన్న విషయం కాదని, జులై 12 న శాంపిల్స్ తీశారు . అదే రోజు బాబు సిఎం గా ప్రమాణ స్వీకారం చేశాడని అన్నారు. ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్ వేనని పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్.
ఆ శాంపిల్స్ లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇది సెంటిమెంట్ కి సంబందించిన విషయమని పేర్కొన్నారు . దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు వైఎస్ షర్మిలా రెడ్డి.
భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారు
చంద్రబాబు ను అడుగుతున్నాం, ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్ గా తీసుకున్నారని నిలదీశారు.
ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు ? దీని తీవ్రత బాబు కి ముందే తెలుసా ? తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు ? జులై 23 న రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు ? మీ 100 రోజుల పాలన సమావేశంలో ఎందుకు చెప్పారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి.
మీ 100 రోజుల పాలన పై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి ఇష్యు దైవర్ట్ చేశారా ? వైసిపి మీద బురద చల్లుతున్నారా అని ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్. మీరు లైట్ తీసుకున్నా మేము మాత్రం వదిలి పెట్టమని హెచ్చరించారు. తిరుమల లడ్డూ కల్తీ పై CBI విచారణ జరగాలని అన్నారు. లడ్డూ కల్తీపై తాము గవర్నర్ ను కలుస్తామని చెప్పారు.