చంద్రబాబు 100 రోజుల పాలన బక్వాస్
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనపై స్పందించారు. శుక్రవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో కొలువు తీరి 100 రోజులు పూర్తయిన సందర్బంగా సంబురాలు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం సాధించారని గొప్పలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడుది ముందు నుంచీ చేసేది గోరంత చెప్పుకునేది, ప్రచారం చేసుకునేది మాత్రం కొండంత అంటూ ఎద్దేవా చేశారు. ఈ 100 రోజుల పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఇచ్చిన ఆరు సిక్స్ హామీలలో ఒక్క సిక్స్ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎక్కడ అమలు చేశారంటూ నిలదీశారు జగన్ మోహన్ రెడ్డి.
ఇది 100 రోజుల పాలన కాదని, ఇది పక్కా 100 రోజుల పచ్చి మోసం అని ఆరోపించారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేనే లేదని, సూపర్ సెవెనూ లేదంటూ సెటైర్ వేశారు ఏపీ మాజీ సీఎం. మోసం తప్పా ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. అన్ని వ్యవస్థలు తిరోగమనం దిశలో ఉన్నాయని, విద్యా దీవెన అటకెక్కిందని, వసతి దీవెన దేవుడెరుగుఉ..బడులు పక్కదారి పట్టాయని ఆరోపించారు జగన్ రెడ్డి.