NEWSANDHRA PRADESH

లేపాక్షి సంస్థ ఉత్ప‌త్తులు వాడాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లంకారీ వ‌స్త్రాలు, ఉత్ప‌త్తుల‌కు పేరు పొందిన లేపాక్షి సంస్థ‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌తి ఒక్క‌రు మ‌నదైన సంస్కృతికి ద‌ర్ప‌ణంగా నిలుస్తోంద‌ని కొనియాడారు డిప్యూటీ సీఎం.

ఇదిలా ఉండ‌గా శుక్రవారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల త‌న కూతురుతో క‌లిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించారు. త‌న‌కు కేటాయించిన బ‌డ్జెట్ లో 40 శాతం మాత్ర‌మే వినియోగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

మిగ‌తా 60 శాతం సొమ్మును వినియోగించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా లేపాక్షి సంస్థ ఆధ్వ‌ర్యంలో త‌యారు చేస్తున్న ఉత్ప‌త్తుల‌ను ఏపీ ప్ర‌జ‌లు , ఉద్యోగులు, ఇత‌రులు విరివిగా వాడాల‌ని దీని వ‌ల్ల సంస్థ‌కు మేలు చేకూరిన‌ట్ల‌వుతుంద‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్.