SPORTS

12 వేల ప‌రుగుల మార్క్ దాటిన కోహ్లీ

Share it with your family & friends

చిదంబ‌రం స్టేడియంలో అరుదైన ఘ‌న‌త

చెన్నై – బంగ్లాదేశ్ తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా కోహ్లీ 12 వేల ప‌రుగుల మైలు రాయిని దాటాడు. ఈ ఘ‌న‌త సాధించిన భార‌తీయ ఆట‌గాడు కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్స్ లో భార‌త జ‌ట్టు నిల‌క‌డ‌గా ఆడుతోంది. కోహ్లీతో పాటు శుభ్ మ‌న్ గిల్ క్రీజులో ఉన్నారు. ప‌రుగులు ధారాళంగా చేస్తున్నారు.

అంతకు ముందు జస్ప్రీత్ బుమ్రా యొక్క శక్తివంతమైన స్పెల్‌తో చెన్నైలో జరిగిన మొదటి టెస్ట్‌లో 2 వ రోజు బంగ్లాదేశ్‌ను 149 పరుగులకు భారత్ కట్టడి చేసింది.

బుమ్రా నాలుగు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జ‌ట్టులో షకీబ్ అల్ హసన్ ఒక్క‌టే 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే 14,192 ప‌రుగులు చేశాడు. మొత్తం 313 ఇన్నింగ్స్ ల‌లో 50.32 శాతంతో సాధించగా కోహ్లీ 243 ఇన్నింగ్స్ ల‌లో 58.84 స్ట్రైక్ రేట్ తో 12005 ర‌న్స్ చేయ‌డం విశేషం.