రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్
యాజమాన్యం సంచలన నిర్ణయం
హైదరాబాద్ – ఐపీఎల్ 2025 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హెడ్ కోచ్ గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఏరికోరి ఎంపిక చేసింది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కీలకమైన కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఉన్నట్టుండి తప్పు కోవడంతో ఆయన స్థానంలో ద్రవిడ్ ను నియమించింది.
ఇక ఈ జట్టుకు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకుంది జట్టు మేనేజ్మెంట్. జట్టు బ్యాటింగ్ కు సంబంధించి ప్రత్యేకంగా కోచ్ ను నియమించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. భారత జట్టుకు చెందిన మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ ను కోచ్ గా నియమించినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా తనను శిక్షకుడిగా నియమించడం పట్ల విక్రమ్ రాథోడ్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టును అత్యంత శక్తివంతమైన జట్టుగా తీర్చి దిద్దడంలో రాహుల్ ద్రవిడ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపాడు.
ఇదే సమయంలో తాను బ్యాటింగ్ కోచ్ గా నియమించడంతో ఆయనతో కలిసి మరోసారి పని చేసే ఛాన్స్ దక్కడం పట్ల తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు విక్రమ్ రాథోడ్. జట్టును విజేతగా నిలిపేలా చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నాడు.