కుట్రలు ఆప్ ను ఆపలేవు – కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం సందర్బంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆప్ ఆధ్వర్యంలో యమునానగర్ లోని జాగాద్రి లో భారీ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా రోడ్ షోను ఉద్దేశించి ప్రసంగించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.
తనను , తన పరివారాన్ని చాలా సార్లు కేంద్రం ఇబ్బందులు పెడుతూనే వచ్చిందన్నారు. అన్యాయంగా, అక్రమంగా తమను జైలుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రతీసారి ప్రజలు తమను ఆదరించారని, అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఈ సందర్బంగా పేరు పేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు ఆయన కాషాయ పరివారం ఎంతగా కుట్రలు పన్నినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం అవుతుందని స్పష్టం చేశారు.
ఇవాళ ప్రజలు స్వచ్చంధంగా ఆప్ ను ఆదరిస్తున్నారని, ఇంతకంటే ఇంకేం చెప్పాలని అన్నారు కేజ్రీవాల్. రాబోయే రోజుల్లో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్దమని దీనిలో ధర్మానిదే గెలుపు సిద్దిస్తుందన్నారు అరవింద్ కేజ్రీవాల్.