DEVOTIONAL

తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీపై నివేదిక ఇవ్వండి

Share it with your family & friends

టీటీడీ ఈవోను ఆదేశించిన కేంద్ర స‌ర్కార్

ఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడిన తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై సాక్షాత్తు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ల‌డ్డూ క‌ల్తీకి గురైంద‌ని, నాణ్య‌మైన నెయ్యిని వాడ లేద‌ని ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో జె. శ్యామ‌ల రావు. ల‌డ్డూ త‌యారీలో ఎక్క‌డా రాజీ ప‌డ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌క్ష ల‌డ్డూల‌ను పంపించింది. అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌ముఖుల‌కు స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పంపిణీ చేశారు.

తాజాగా చోటు చేసుకున్న ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారానికి సంబంధించి నివేదిక ఇవ్వాల‌ని టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావును కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. జనవరి 22న అయోధ్యకు తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపించారు.

కాగా ఇటీవ‌ల ల్యాబ్ లో ప‌రీక్షిస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. ల‌డ్డూ తయారీలో పంది కొవ్వు, బీఫ్ టాలో, పామాయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. నాణ్యతను ‘పాథటిక్’గా అభివర్ణించారు.