బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి

సీపీకి మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ఫిర్యాదు

హైద‌రాబాద్ : త‌మ‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌మైన వేధింపుల‌కు పాల్పడుతున్నారంటూ మ‌హిళా జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం తాము కూడా ఈ దేశ పౌరుల‌మేన‌ని, త‌మ‌కు కూడా వాక్ స్వ‌తంత్రం ఉంటుంద‌ని, ప్రాథ‌మ‌క హ‌క్కులు కూడా ఉంటాయ‌ని పేర్కొన్నారు. నానా దుర్భాష లాడుతున్నార‌ని, అడ్డ‌మైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేద‌న చెందారు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు. ట్రోలింగ్‌ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.

విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిల్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, ఐపీసీ, ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆన్‌లైన్‌–భౌతిక రక్షణను కల్పించాలని విన్న‌వించారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ను. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని చెప్పారు . హైదరాబాద్‌ సిటీ పోలీసులు సమర్పించిన సమాచారాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *