ప్రజా ఆరోగ్యంపై బీఆర్ఎస్ కమిటీ ఆరా
కమిటీతో సమావేశమైన మాజీ మంత్రి
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ గాడి తప్పిందని, పేదలకు, సామాన్యులకు , రోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఆదివారం ఆయన బీఆర్ఎస్ పార్టీ నియమించిన త్రీ మెన్ కమిటీ (త్రిసభ్య )తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్ లో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు కేటీఆర్ కమిటీ సభ్యులకు.
రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని పార్టీ నియమించింది.
ఇదిలా ఉండగా ఇవాల్టి నుంచే బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ తన కార్యాచరణను ప్రారంభించింది. రాష్ట్రంలోని పలు ఆస్పత్రులను , పీహెచ్ సీలను సందర్శిస్తుందని, ఈ మేరకు పూర్తి నివేదికను రాష్ట్ర సర్కార్ కు సమర్పించనుందని వెల్లడించారు మాజీ మంత్రి కేటీఆర్.