DEVOTIONAL

రాజ‌కీయ ల‌బ్ది కోసం శ్రీ‌వారి ల‌డ్డూ వివాదం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు జిల్లా – ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులను అరిక‌ట్ట‌డంలో విఫ‌లం చెందాడ‌ని, ప‌నిగ‌ట్టుకుని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేశాడ‌ని మండిప‌డ్డారు. ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

త‌న 100 రోజుల పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు. వ‌రుస‌గా త‌ప్పులు చేసుకుంటూ పోయిన చంద్ర‌బాబు వాటిని క‌ప్పి పుచ్చుకునేందుకే తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి సంబంధించిన శ్రీ‌వారి ల‌డ్డూపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించారు మాజీ మంత్రి.

తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒక‌టి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

చంద్రబాబు త‌న స్థాయికి దిగ‌జారి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు ఛీ కొడుతున్నార‌ని చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. మ‌రో వైపు టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, సిఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నార‌ని , మ‌రి జగన్ అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లు చంద్ర‌బాబు నాయుడు ఎలా చెబుతారంటూ ప్ర‌శ్నించారు.

ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు మీడియా సాక్షిగా ప్ర‌క‌టించార‌ని, గ‌త‌ జూలై 23 న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారని , అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ చెప్పార‌ని ఆ విష‌యం తెలుసు కోకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. దేశ వ్యాప్తంగా తాను చేసిన కామెంట్స్ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయ్యేస‌రికి దిద్దుబాటు చ‌ర్య‌లకు దిగాడ‌ని అన్నారు. తిరిగి ఈవో పై ఒత్తిడి తెచ్చి కాదంటూ చెప్పించే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు మాజీ మంత్రి.