యావత్ ప్రపంచాన్ని విస్మయ పరిచిన నేత
విజయవాడ : యావత్ భారత జాతికి స్పూర్తి దాయకంగా దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా శక్తికి ప్రతీక, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని చల్లపల్లి బంగ్లా వద్ద మహనీయురాలి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. . జమిందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం, భూ సంస్కరణలు, అణుశక్తి అభివృద్ధి, మహిళా సాధికారిత లాంటి ఇందిరా గాంధీ కీలక సంస్కరణలు దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయని అన్నారు.
ఆమె ఇవాళ మనందరి మధ్య భౌతికంగా లేక పోవచ్చు. కానీ ఇందిరా గాంధీ సాధించిన విజయవాలు, నాయకత్వ నైపుణ్యం, ప్రత్యేకించి దేశం కోసం తాను తీసుకున్న అసాధారణ నిర్ణయాలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఇందిర , విజయేందిర బతికే ఉంటుందని, కోట్లాది గుండెల్లో గూడు కట్టుకుని నిలిచి ఉంటుందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గాంధీ కుటుంబం ఈ దేశం బలై పోయారని, సిక్కుల కాల్పుల్లో తను నేలకొరిగారని, నేటికీ ఇందిర అంటేనే ఇండియా అని దానిని కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు .






