ప్రారంభించిన మంత్రి దామోదర రాజ నరసింహా
హైదరాబాద్ : ఉద్యోగులకు విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా. బుధవారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన AI Based మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు.
ఈ హెల్త్ క్యాంపు లో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆద్వర్వం లో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ అద్వర్యం లో వచ్చిన వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్ మెంట్ సాయం తో BP , GRBS , ECG , 2D Echo పరీక్షలను నిర్వహించారు . కార్డియాలజీ , జనరల్ ఫీజిషన్ సేవలను free కన్సల్టేషన్ సేవలను ఉద్యోగులకు అందించారు .
ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడారు..మారుతున్న జీవన శైలిలలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు . ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను , పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బంది ని మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.






