NEWSTELANGANA

మేడిగ‌డ్డ నిర్మాణం భారీ స్కాం

Share it with your family & friends

నిగ్గు తేల్చిన విజిలెన్స్ టీం

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మేడిగ‌డ్డ పిల్ల‌ర్స్ కుంగి పోయాయి. ఇదే ఎన్నిక‌ల ప్ర‌చార అస్త్రంగా మారింది. ఈ మేర‌కు ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెల్ల‌డంలో కాంగ్రెస్ పార్టీ స‌క్సెస్ అయ్యింది. దెబ్బ‌కు బీఆర్ఎస్ స‌ర్కార్ కూలి పోయింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. ఆ త‌ర్వాత వెంట వెంట‌నే ఆయా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డం ప్రారంభించారు. విస్తు పోయేలా వాస్త‌వాలు వెలుగు చూశాయి.

ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును మంత్రులు సంద‌ర్శించారు. డొల్ల‌త‌నం ఏమిటో ద‌గ్గ‌రుండి చూశారు. ఇక ప్ర‌భుత్వం దీనికి సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించింది. ఇందులో భాగంగా మేడిగ‌డ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌ని తేల్చింది. ఈ మేర‌కు పూర్తి నివేదిక‌ను త్వ‌ర‌లో రాష్ట్ర స‌ర్కార్ కు అంద‌జేయ‌నుంది.

విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచార‌ణ‌లో సంచ‌ల‌న అంశాలు వెలుగు చూశాయి. ఏకంగా రూ.3,200 కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని నిర్మాణం పేరుతో త‌గ‌లేశారంటూ ఆరోపించింది. నిర్మాణంలో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వాములేనంటూ స్ప‌ష్టం చేసింది . వ‌ర‌ద ఉధృతి అంచ‌నా లేకుండానే డిజైన్ చేశార‌ని ఆరోపించింది. బ్యారేజ్ కుంగ‌డం అక‌స్మాత్తుగా జ‌రిగింది కాదంటూ పేర్కొంది.