దేవరను ఆదరించండి – జాహ్నవి కపూర్
మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ప్రకటన
హైదరాబాద్ – ప్రముఖ నటి జాహ్నవి కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన దేవర చిత్రం మీ ముందుకు సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు.
మిమ్మల్ని ఈ సందర్బంగా కలుసు కోవడం, పలకరించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమకోర్చి దేవర సినిమా చేయడం జరిగిందని పేర్కొన్నారు జాహ్నవి కపూర్. అందరినీ స్వయంగా కలుసు కోవాలని తనకు ఉందని, కానీ షూటింగ్ , వ్యక్తిగత పనుల కారణంగా కుదర లేదని స్పష్టం చేశారు.
త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని వెల్లడించారు ముంబై నటి. ఈ ప్రస్తుతానికి నా ఈ చిన్న మెస్సేజ్ ను స్వీకరించాలని కోరారు జాహ్నవి కపూర్. డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన కొరటాల శివ సారథ్యంలో దేవర అద్భుతంగా రూపు దిద్దుకుందని, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు నటి.
ప్రత్యేకించి తారక్ నటన అద్భుతంగా ఉంటుందని, అది సినిమా చూస్తేనే తెలుస్తుందన్నారు. ఆయనతో కలిసి నటించడం పట్ల తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు జాహ్నవి కపూర్. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.