అబద్దాలు చెప్పడంలో బాబు దిట్ట – గోపాలకృష్ణ
మాజీ మంత్రి చెల్లుబోయిన షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా చిల్లర రాజకీయాలు చేయడం బాబుకు తగదని ఆయన హితవు పలికారు.
ఒకవేళ ఏదైనా జరిగింది అనుకుంటే అధికారంలో ఉన్న సీఎంకు సర్వ హక్కులు ఉంటాయని, ఆ దిశగా ముందు జాగ్రత్తగా విచారణకు ఆదేశించకుండా తానే అన్నీ కనిపెట్టినట్లు ప్రకటించడం, అనుచిత కామెంట్స్ చేయడం దారుణమన్నారు చెల్లుబోయిన గోపాలకృష్ణ.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి కుట్రకు చంద్రబాబు నాయుడు తెర తీశాడని, అయినా ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. అబద్ధాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయం చేయడంలో బాబు దిట్ట అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి.
100 రోజుల పాలన మీటింగ్ అని ఒక డైవర్షన్ కి తెర లేపాడంటూ ధ్వజమెత్తారు.. తిరుమల క్షేత్రంలో లడ్డూలో ఒక వాడ కూడనటువంటి, విన కూడనటువంటి పదాలు వాడాడని, ఆయనను శ్రీవారి భక్తులు ఛీదరించు కుంటున్నారని చెప్పారు చెన్నుబోయిన గోపాలకృష్ణ.
మరో వైపు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన పూర్తి బాధ్యతా రాహిత్యంతో మాట్లాడాడని మండిపడ్డారు. ఈవోను పెట్టడం వరకే తమ పని అని, టీటీడీతో సీఎంకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని టీడీపీ వాళ్లు చెప్పుకుంటుంటే ముంచిన ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని సూచించారు.