DEVOTIONAL

గుర్తింపు సంస్థ‌ల నుంచి నెయ్యి కొనుగోలు – ఈవో

Share it with your family & friends

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై జె. శ్యామ‌ల రావు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య కార్య నిర్వహ‌ణ అధికారి (ఈవో) జె. శ్యామ‌ల రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం, దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో సోమ‌వారం తిరుమ‌ల ఆల‌యంలో శాంతి యాగం చేప‌ట్టారు. యాగం పూర్త‌యిన అనంత‌రం ఈవో జె. శ్యామ‌ల రావు మీడియాతో మాట్లాడారు.

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీకి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. పూర్తి నివేదిక‌ను సీఎంకు స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అయితే ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్‌డీడీబీ నివేదికల్లో పేర్కొన్న‌ట్లు తెలిపారు ఈవో.

దీంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చామ‌ని చెప్పారు జె. శ్యామ‌ల రావు. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతానికి కేజీ రూ.478కి కొంటున్నామ‌ని వెల్ల‌డించారు.

ఈ రెండు సంస్థల నుంచి తీసుకుంటున్న నెయ్యిని ఎన్‌డీడీబీ ల్యాబ్‌లో పరీక్షించగా బాగున్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌కు నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించిన‌ట్లు పేర్కొన్నారు ఈవో .

ప్రస్తుతానికి వాటిలో మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందని, తితిదే వద్ద ఉన్న ల్యాబ్‌లలో కల్తీ విషయం బయట పడదని తెలిపారు.