సీఎం కుర్చీ నాది కాదు కేజ్రీవాల్ ది – సీఎం
అతిషి సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ – ఢిల్లీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గతంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన అతిషి సింగ్ సోమవారం అధికారికంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం తనది కాదని పేర్కొన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకుడైన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ది అని స్పష్టం చేశారు.
తాను తాత్కాలిక ముఖ్యమంత్రిని మాత్రమేనని పేర్కొన్నారు. ఒక రకంగా తమ నాయకుడు లేకుండా తాను సీఎంగా కొలువు తీరడం ఒకింత బాధగా ఉందన్నారు. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారని , ఉంటారని చెప్పారు అతిషి సింగ్.
ఇవాళ నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. తన అన్నయ్య శ్రీరాముడు 14 ఏళ్ల అజ్ఞాత వాసానికి వెళ్లిన సమయంలో భరతుడికి ఎలాంటి బాధ కలిగిందో అలాంటి ఆవేదనను తాను అనుభవిస్తున్నట్లు చెప్పారు సీఎం.
అయోధ్య పాలనను భరతుడు చేపట్టాల్సి వచ్చినప్పుడు కూడా అదే బాధ నా హృదయంలో ఉందన్నారు. భరతుడు శ్రీరాముని చెప్పులు ధరించి అయోధ్యను 14 సంవత్సరాలు పాలించినట్లే, నేను ఢిల్లీ ప్రభుత్వాన్ని 4 నెలల పాటు నడుపుతానని అన్నారు సీఎం అతిషి సింగ్.