ఆస్కార్ రేసులో ‘లాపతా లేడీస్’ చిత్రం
ఎంపిక చేసిన 13 మంది సభ్యుల కమిటీ
హైదరాబాద్ – కిరణ్ రావు, అమీర్ ఖాన్ , జ్యోతి దేశ్ పాండే కలిసి నిర్మించిన లాపతా లేడీస్ చిత్రం ఆస్కార్ అవార్డుల కమిటీకి ఏకగ్రీవంగా ఎంపికైంది భారత దేశం తరపున. 13 మంది సభ్యులు కమిటీ లాపతా లేడీస్ చిత్రాన్ని ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్ర విభాగంలో పరిశీలన కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఈ లాపతా లేడీస్ చిత్రాన్ని కిరణ్ రావు నిర్మించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. ఇదిలా ఉండగా ఆస్కార్ చిత్రాల ఎంపిక పరిశీలన కోసం పెద్ద ఎత్తున సినిమాలు వచ్చాయి. వాటిలో తెలుగు సినీ రంగానికి చెందిన డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం కూడా ఉంది. ఇందులో రణబీర్ కపూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించారు.
ఈ యానిమల్ తో పాటు మలయాళ చిత్రం ఆట్టం, తమిళ మూవీ మహా రాజా, నాగ్ అశ్విన్ తీసిన ప్రభాస్ , దీపికా పదుకొనే నటించిన కల్కి సహా 28 చిత్రాలను పరిగణలోకి తీసుకున్నారు. చివరకు కిరణ్ రావు తీసిన లాపతా లేడీస్ చిత్రాన్ని ఆస్కార్ చిత్రాల పరిశీలనకు ఎంపిక చేయడం విశేషం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.06 కోట్లు వసూలు చేసింది.
2023లో ఈ సినిమా వచ్చింది. లాపతా లేడీస్ అంటే తప్పి పోయిన స్త్రీలు అని అర్థం. హిందీ భాషలో వచ్చిన హాస్య నాటకీయ చిత్రం. ఈ సినిమాను రూ. 5 కోట్లు పెట్టి తీశారు. భారీ ఆదాయం సమకూరింది.