NEWSANDHRA PRADESH

రేపే పంతం నానాజీ ప్రాయ‌శ్చిత దీక్ష

Share it with your family & friends

ప్ర‌క‌టించిన జ‌న‌సేన ఎమ్మెల్యే

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీకి చెందిన పంతం నానాజీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను ద‌ళిత వైద్యుడిని దూషించ‌డం త‌ప్పేన‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ చెప్పాన‌ని అన్నారు. అయితే ఎందుకో త‌న మ‌న‌సు ఒప్పు కోవ‌డం లేదన్నారు పంతం నానాజీ.

ఈ మేర‌కు తాను ఓ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌న క‌న్నీళ్ల‌ను ఆపు కోలేక పోయారు. కంట‌త‌డి పెట్టుకున్నారు పాపం. డాక్ట‌ర్ ను దూషించడం త‌ప్పేన‌ని, అలా అని ఉండాల్సింది కాద‌న్నారు పంతం నానాజీ.

నేను నిన్న ఆవేశంతో అలా మాట్లాడాన‌ని, అలా మాట్లాడి ఉండ‌వ‌ల్సింది కాద‌న్నారు ఎమ్మెల్యే. డాక్ట‌ర్ ను దూషించినందుకు గాను తాను సెప్టెంబ‌ర్ 24న మంగ‌ళ‌వారం ప్రాయ‌శ్చిత దీక్ష చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు పంతం నానాజీ.

ఒక ప్ర‌జా ప్ర‌తినిధిగా అలా ఉండ కూడ‌ద‌న్నారు. ఎవ‌రో త‌ప్పు చేస్తేనే త‌మ నాయ‌కుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల దీక్ష చేప‌ట్టార‌ని, తాను ఎందుకు దీక్ష చేప‌ట్ట కూడ‌ద‌ని తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు పంతం నానాజీ.