DEVOTIONAL

తిరుమ‌ల‌లో ముగిసిన శాంతి హోమం

Share it with your family & friends

దోషాల నివార‌ణ కోసం యాగం నిర్వ‌హ‌ణ

తిరుమ‌ల – తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసిన త‌రుణంలో టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం భారీ ఎత్తున శ్రీ‌వారి ఆల‌యంలో శాంతి యాగం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా దోషాల నివార‌ణ కోసం, భ‌క్తుల శ్రేయ‌స్సు కోసం ఈ యాగంను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈవోతో పాటు అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర బ్ర‌హ్మంతో పాటు ప్ర‌ధాన అర్చ‌కులు, పూజారులు, ఆగ‌మ శాస్త్ర పండితులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా శాంతి హోమం ఘ‌నంగా జ‌రిగింద‌ని తెలిపారు ఈవో.

ఇదిలా ఉండ‌గా అర్చ‌కులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు సాయంత్రం క్ష‌మా మంత్రం ప‌ఠించాల‌ని సూచించారు. దీని వ‌ల్ల దోష నివార‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

కాగా తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో జంతువుల , చేప నూనె వాడిన‌ట్లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. చివ‌ర‌కు సిట్ ను వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి ఈవో క్లారిటీ ఇచ్చారు.