మీ అపూర్వమైన ఆదరణకు థ్యాంక్స్ – పీఎం
న్యూయార్క్ వాసులారా మిమ్మల్ని మర్చి పోలేను
అమెరికా – మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాను సందర్శించిన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిష్టాత్మకమైన క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా యుఎస్ లో పర్యటించిన ప్రధానమంత్రికి ఊహించని రీతిలో అపూర్వమైన స్వాగతం లభించింది.
ప్రధానంగా న్యూయార్క్ నగరంలో మోడీకి ఘన స్వాగతం లభించడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు . ప్రవాస భారతీయుల ఆత్మీయతను, వారి ఆదరాభిమానాలను తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఇలాంటి జ్ఞాపకాలు తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉండి పోతాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
న్యూయార్క్ నగరానికి, మీ అందరికీ, ప్రవాస భారతీయులకు, అమెరికన్లకు , నా సోదర సోదరీమణులకు పేరు పేరునా పలకరించినందుకు, గ్రాండ్ వెల్ కమ్ చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ తెలిపారు ప్రధానమంత్రి.
గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా దేశాల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. మీరు అందించిన ఈ ఆతిథ్యం గుర్తుండి పోతుందన్నారు మోడీ.