NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఎందుకు ఇవ్వ‌లేదో చెప్పాలి

Share it with your family & friends

డిమాండ్ చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు మ‌రోసారి. ఆయ‌న దేవుళ్ల‌ను ద‌ర్శించు కోవ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. కానీ త‌న హ‌యాంలో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న స‌మ‌యంలో ముందుగా డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. దీనిపై సంత‌కం కూడా చేయాల‌న్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

కావాల‌ని తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్క‌న పెట్టార‌ని, పుణ్య క్షేత్రాన్ని ప‌ట్టించు కోలేద‌ని, అన్య‌మ‌త‌స్థుల‌తో నింపారంటూ మండిప‌డ్డారు. చేసిన త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదని అన్నారు.

అది అడిగితే బూతులు తిట్టారు. ఆంజనేయ స్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు… హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వర స్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రథం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారని గుర్తు చేశారు.

తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనో భావాలను దెబ్బ తీశారంటూ ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని పిలుపునిచ్చారు.