హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఫిర్యాదు
అధ్యక్షుడు..కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి మరికంటి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీఏ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హెచ్ సీ ఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, కార్యదర్శిపై మండిపడ్డారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేక పోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు మరికంటి భవానీ రెడ్డి.
ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అసలు సంస్థలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ మేరకు పార్టీ ప్రతినిధులతో కలిసి మరికంటి భవానీ రెడ్డి హెచ్ సీ ఏ అధ్యక్షుడు, కార్యదర్శిపై డైరెక్టరేట్ జనలర్ విజిలెన్స్ (ఏడీజీ)కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరైన పద్దతిలో నడిచేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.