ఏ ప్రభుత్వమైనా అథవాలేకు ఢోకా లేదు
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి
ముంబై – కేంద్ర ఉపరితల, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. అంతే కాదు వచ్చేసారి వస్తామో రామోనన్న అనుమానం వ్యక్తం చేయడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కేబినెట్ లో కొలువు తీరిన రామ్ దాస్ అథవాలే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన నితిన్ గడ్కరీ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
మేం నాలుగోసారి పవర్ లోకి వస్తామో తెలియదు..ఆ అవకాశం కనిపించడం లేదు. కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అందులో కేంద్ర మంత్రిగా రామ్ దాస్ అథవాలేకు చోటు దక్కడం ఖాయమని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నితిన్ గడ్కరీ.
అథవాలే అందరితో స్నేహ పూర్వకంగా ఉంటారని పేర్కొన్నారు. అంతే కాదు ఆయన కేబినెట్ లో ఉంటే ఆ కిక్కే వేరన్నారు. హాస్యం, ఆలోచనాత్మకంగా ప్రసంగించడం అథవాలేకు వెన్నతో పెట్టిన విద్య అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ అమెరికా టూర్ లో ఉన్న సమయంలో నితిన్ గడ్కరీ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపుతోంది కాషాయ వర్గాలలో.