మోడీ మౌనం ‘స్వామి’ ఆగ్రహం
చైనా ఆక్రమణపై మౌనం ఎందుకు
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుబ్రమణియన్ స్వామి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి కాషాయ సంస్థల్లో, వర్గాలలో.
ప్రధానంగా చైనా ఆక్రమించుకున్న దాని గురించి ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించడం లేదని నిలదీశారు. గత ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2023 వరకు లాక్కున్న 4064 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనాను ఖాళీ చేయమని డిమాండ్ ఎందుకు చేయకుండా మౌనంగా ఉన్నారంటూ నిప్పులు చెరిగారు సుబ్రమణియన్ స్వామి.
చైనాతో సాధారణీకరణను ప్రతిపాదించడం ద్వారా మోడీ భారతదేశ జాతీయ ప్రయోజనాలను విక్రయించ బోతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత. ఆయన ఇప్పటికీ సాధారణీకరణ కోసం పట్టుబడితే ఆయనను పీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సుబ్రమణియన్ స్వామి.