ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర
99 మందికి పదవులలో ఛాన్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. పలువురికి పోస్టులలో ఛాన్స్ ఇచ్చింది. కీలకమైన సంస్థలకు చైర్మన్లతో పాటు సభ్యులు, డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చింది.
ఇందులో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులకు చోటు కల్పించింది. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఛాన్స్ దక్కని వారికి, ఆఖరు నిమిషంలో బి ఫామ్ దొరకని వారికి , పార్టీ కోసం కష్ట పడిన వారికి నామినేటెడ్ పదవులలో భర్తీ చేశారు నారా చంద్రబాబు నాయుడు.
సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేయడం విశేషం. ఇందులో భాగంగా ఇవాళ ప్రకటించిన వాటిలో మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ లిస్టును ప్రకటించింది కూటమి సర్కార్. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చింది.
11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లుగా ఉన్న వారికి పదవులు దక్కాయి. ఇందులో ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్ లకు ఛాన్స్ ఇచ్చారు.
మొత్తం ఏపీలో 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, మరో కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ తో పాటు ఆయా సంస్థలలో సభ్యులను ప్రకటించింది సర్కార్. యూత్ కు ప్రయారిటీ ఇవ్వడం విశేషం.