శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జోక్స్ వద్దు
కార్తీక్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ సీరియస్
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా తిరుమల పుణ్య క్షేత్రానికి సంబంధించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఈవో జె. శ్యామల రావుతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదంపై స్పందించారు.
ఇదిలా ఉండగా లడ్డూ ప్రసాదంపై తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. సినీ ఇండస్ట్రీలో కొందరు కావాలని లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారంటూ మండి పడ్డారు. ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నాడంటూ పేర్కొనడం కలకలం రేపింది.
ఆ హీరో ఎవరో కాదు తమిళ సినీ నటుడు కార్తీ గురించేనని తెలిసి పోయింది. ఇదే సమయంలో మరో అగ్ర నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, కానీ ఒక్క లడ్డూ పేరుతో రాజకీయం చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఆయనను కూడా ఏకి పారేశారు పవన్ కళ్యాణ్.
దీనిపై ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందంచారు నటుడు కార్తీ. తనకు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విపరీతమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. ఎవరి మనసు నొప్పించినా క్షమించాలని కోరారు.