కార్తీ కామెంట్స్ పై సూర్య క్షమాపణ
తాను కూడా దీక్షకు దిగుతున్నానని ప్రకటన
తమిళనాడు – ప్రముఖ తమిళ సినీ నటుడు సూర్య శివకుమార్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా తన సోదరుడు, నటుడు కార్తీ చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెబుతున్నానని స్పష్టం చేశారు. తనను, తన సోదరుడిని మన్నించాలని సూర్య శివకుమార్ కోరారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఆడియో ఫంక్షన్లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నటుడు కార్తీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. దీనిని హైలెట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
లడ్డూ కల్తీపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన 11 రోజుల పాటు దీక్షకు దిగారు. అక్టోబర్ 2న తిరుమలలో తన ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. కాగా తన సోదరుడు కార్తీ చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా మనసు బాధ పడితే తమను మన్నించాలని కోరారు సూర్య శివకుమార్.
తమ్ముడి కామెంట్స్ కు చింతిస్తూ తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేపట్టున్నట్లు ప్రకటించారు ప్రముఖ నటుడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సిసలైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు.