నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదు
స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా – ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి కీలక ప్రకటన చేశారు. తన పేరుతో కొందరు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి లేనిపోని కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆర్కే రోజా సెల్వమణి స్పందించారు .
పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, సహచరులు, అభిమానులు దయచేసి తనకు సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ , థ్రెడ్స్ మాత్రమే ఉన్నాయని, వీటి ద్వారానే తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్నానని స్పష్టం చేశారు.
మీ అందరికీ అందుబాటులో ఉండేందుకే తాను వీటిని వాడుతున్నట్లు తెలిపారు ఆర్కే రోజా సెల్వమణి. అయితే తనకు సంబంధించి ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని పేర్కొన్నారు. దీనిని గమనించాలని ఆమె కోరారు.
తనపై పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి అని ఆవేదన వ్యక్తం చేశారు. \ వెంటనే సదరు ఛానల్స్ తన పేరు పై ఉన్న అకౌంట్ లను డెలీట్ చెయ్యాలని కోరారు. లేక పోతే ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై గూగుల్ , యూట్యూబ్ యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు ఆర్కే రోజా సెల్వమణి.