NEWSNATIONAL

జ్యోతి యాద‌వ్ కు స్టేట్స్ మ‌న్ అవార్డు

Share it with your family & friends

ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నానికి పుర‌స్కారం

ఢిల్లీ – ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్ మీడియా రంగాల‌లో అత్యున్న‌త‌మైన ప్ర‌తిభ‌, ప‌రిశోధ‌న సాగించే జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే అరుదైన పుర‌స్కారం భార‌తీయ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కు ద‌క్కింది. ది ప్రింట్ ఇండియా డిజిట‌ల్ మీడియాకు అసిస్టెంట్ ఎడిట‌ర్ గా ఉన్న జ్యోతి యాద‌వ్ కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స్టేట్స్ మ‌న్ అవార్డు ద‌క్కింది. ఇందుకు సంబంధించి త‌న సంతోషాన్ని మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు జ్యోతి యాద‌వ్.

మీడియా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగి ఉన్నారు జ్యోతి యాద‌వ్. ఆమెకు తాజాగా స్టేట్స్ మ‌న్ అవార్డుతో పాటు గ‌తంలో కూడా ప‌లు అవార్డులు పొందారు. వాటిలో రామ్ నాథ్ గోయెంకా, ఐపీఎల్, రెడ్ లింక్, పీఐఐ-ఐసీఆర్సీ పుర‌స్కార‌ల‌ను అందుకున్నారు.

వృత్తి ప‌ట్ల ప్రేమ‌, సామాజిక బాధ్య‌త‌తో కూడిన క‌థ‌నాల‌ను రాయ‌డం జ్యోతి యాద‌వ్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇదిలా ఉండ‌గా తాజాగా స్టేట్స్ మ‌న్ పుర‌స్కారం బీహార్ యూట‌ర్న్ స్కామ్ పై రూర‌ల్ జ‌ర్న‌లిజం కింద 2023 సంవ‌త్స‌రానికి అవార్డుకు ఎంపిక‌య్యారు జ్యోతి యాద‌వ్.

పేద మహిళలపై, తరచుగా దళిత వర్గాలకు చెందిన వారి అవయవాలను దోచుకుంటున్న అసాంఘిక మెడికల్ మాఫియాను ఈ కథ పరిశోధించింది. దేశ వ్యాప్తంగా ఈ క‌థ‌నం సంచ‌ల‌నం క‌లిగించింది.