NEWSNATIONAL

విచార‌ణ‌కు ఆదేశిస్తే త‌ప్పు చేసిన‌ట్టు కాదు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క – క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముడా కేసుకు సంబంధించి హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ప్ర‌స్తుతం సీఎం తో పాటు త‌న కుటుంబం ముడా కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీఎంపై విచార‌ణ‌కు ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ క‌ర్ణాట‌క రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం హైకోర్టును ఆశ్ర‌యించారు.

అయితే ముడా కేసులో, పిసి యాక్ట్‌లోని బిఎన్‌ఎస్‌ఎస్ 218 మరియు 19 ప్రకారం ప్రాసిక్యూషన్‌ను అనుమతించడానికి కోర్టు నిరాకరించింది. పిసి యాక్ట్‌లోని 17 ఎ కింద దర్యాప్తుకు ఆదేశించింది. ఈ తీర్పు ఆధారంగా తదుపరి న్యాయ పోరాటంపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌.

ఈ సంద‌ర్బంగా సీఎం మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పారు. 17ఎ దర్యాప్తునకు ఆదేశించినంత మాత్రాన తాను తప్పు చేశానని కాదన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వంపై ప్రభుత్వం కుట్రకు పాల్ప‌డింద‌ని ఆరోపించారు సిద్ద‌రామ‌య్య‌.

దేశం మొత్తం మీద త‌న‌పై, కర్ణాటకలోని త‌మ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం. రాబోయే రోజుల్లో త‌ప్ప‌కుండా గెలుస్తామ‌న్నారు. అయితే బీజేపీని రాజ‌కీయంగా ఎదుర్కొంటామ‌న్నారు.

కేంద్ర మంత్రి కుమార స్వామిపై తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. ఆయ‌న చెప్పినంత మాత్రాన తాను ఎందుకు రాజీనామా చేయాల‌ని ప్ర‌శ్నించారు. త‌ను కూడా బెయిల్ పై బ‌య‌టకు వ‌చ్చార‌ని, ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారా అని నిల‌దీశారు సిద్ద‌రామ‌య్య‌.