NEWSTELANGANA

టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ గా మాజీ డీజీపీ

Share it with your family & friends

ఖ‌రారు చేసిన రేవంత్ రెడ్డి స‌ర్కార్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తీవ్ర అవినీతి, ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) చైర్మ‌న్ ,స‌భ్యుల ఎంపిక‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. ఈనెల 18 వ‌ర‌కు తుది గ‌డువు విధించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

వీరిని ఎంపిక చేసేందుకు సెర్చ్ క‌మిటీని ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి స‌ర్కార్. టీఎస్పీఎస్సీ చీఫ్ పోస్టుకు 50 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఇత‌ర స‌భ్యుల స్థానాల‌కు 321 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం విశేషం. చైర్మ‌న్, స‌భ్యుల పోస్టుల‌కు సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించింది సెర్చ్ క‌మిటీ. చివ‌ర‌కు టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

ఆమోదం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ వ‌ద్ద‌కు ఆమోదం కోసం ఫైల్ ను పంపించింది. ఆయ‌న గ‌తంలో కేసీఆర్ స‌ర్కార్ హ‌యాంలో డీజీపీగా విధులు నిర్వ‌హించారు. సౌమ్యుడిగా, వివాద ర‌హితుడిగా పేరు పొందారు. చైర్మ‌న్ రేసులో ఆకునూరి ముర‌ళి, కోదండ‌రామ్ , త‌దిత‌రుల పేర్లు కూడా ఆ మ‌ధ్య‌న వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు రెడ్డి వైపే సీఎం మొగ్గు చూప‌డం విశేషం.