అబార్షన్ హక్కుల పరిరక్షణ చట్టానికి మద్దతు
ప్రకటించిన అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు
అమెరికా – యుఎస్ దేశ ఉపాధ్యక్షురాలు, ప్రస్తుత ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి సంబంధించి మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనమని పేర్కొన్నారు.
ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని సూచించారు కమలా హారీస్. ఇదే సమయంలో మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అబార్షన్ హక్కులపై కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు దేశ ఉపాధ్యక్షురాలు.
మహిళలు కూడా మనుషులేనని, వారికి సంబంధించి అబార్షన్ హక్కులను పరిరక్షించే చట్టాన్ని ఆమోదించే చర్యకు తాను మద్దతు ఇస్తానని కమలా హారిస్ ప్రకటించారు.
వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ, సెనేట్లో అబార్షన్ హక్కుల రక్షణను ఆమోదించడానికి తాను సంపూర్ణంగా సహకారం అందిస్తానని చెప్పారు. విస్కాన్సిన్ పబ్లిక్ రేడియోలో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి మార్పు కోసం పిలుపునిచ్చారు.