ENTERTAINMENT

బాలు గాత్రం అజ‌రామ‌రం – చంద్ర‌బాబు

Share it with your family & friends

వ‌ర్దంతి సంద‌ర్బంగా ఘ‌నంగా నివాళి

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త గాయ‌కుడు పండితారాధ్యుల బాల సుబ్ర‌మ‌ణ్యం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సెప్టెంబ‌ర్ 25న క‌రోనా కార‌ణంగా చెన్నైలో మృతి చెందారు. ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం వ‌ర్దంతి. ఈ సంద‌ర్బంగా సీఎం స్పందించారు. భార‌తీయ సంగీత చ‌రిత్ర‌లో చెర‌ప లేని మ‌ధుర‌మైన జ్ఞాప‌కం ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం అని పేర్కొన్నారు.

వేలాది పాట‌లు పాడ‌డ‌మే కాదు గొప్ప మాన‌వ‌తా వాదిగా గుర్తింపు పొందార‌ని కొనియాడారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తెలుగు వాడిగా పుట్ట‌డం మ‌నంద‌రికి గ‌ర్వ కార‌ణ‌మ‌ని అన్నారు. ప‌లు భాష‌ల‌లో అద్భుత‌మైన త‌న గాత్రంతో పాటల‌కు ప్రాణం పోశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని, ఆయ‌న‌ను తాను మ‌రిచి పోలేన‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఆయ‌న లేక పోయినా పాడిన పాట‌లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ‌ని, సూర్య చంద్రులు ఉన్నంత కాలం బాలు గాత్రం బ‌తికే ఉంటుంద‌ని అన్నారు. ఆ అమ‌ర గాయ‌కుడికి అశ్రు నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు ఏపీ సీఎం.