బాలు జ్ఞాపకం పదిలం – కేసీఆర్
వర్దంతి సందర్బంగా ఘనంగా నివాళి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 25న దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని వీడారు. ఇవాళ ఆయన వర్దంతి. ఈ సందర్బంగా అమర గాయకుడికి నివాళులు అర్పించారు. భారతీయ సంగీత చరిత్రలో చెరప లేని మధురమైన జ్ఞాపకం ఎస్పీ బాల సుబ్రమణ్యం అని పేర్కొన్నారు.
ఒకటా రెండా వేలాది పాటలతో తెలుగు వారిని అలరించారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, ప్రయోక్తగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారని కొనియాడారు.
భారతీయ సినీ సంగీత రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, అంతకు మించిన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప కళాకారుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం అని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
వేలాది పాటలతో కోట్లాది మందిని అలరించారని, ఆయన పాటలు ఇప్పటికీ ఎల్లప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. దివంగత అమర గాయకుడికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.