దేవర టికెట్ ధరల పెంపుపై కోర్టు షాక్
10 రోజుల వరకే పరిమితం చేయండి
అమరావతి – కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ కలిసి నటించిన దేవర చిత్రానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. తమ ఇష్టానుసారంగా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాడన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది కోర్టులో.
దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్న ధరలను కంటిన్యూ చేయకుండా కేవలం కొన్ని రోజుల పాటు పెంచు కోవడానికి ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రశ్నించింది. ప్రేక్షకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా టికెట్ ధరలను పెంచుకుంటూ పోతే చివరకు నష్టం జరిగేది ప్రేక్షకులకు తప్ప సినిమా వారికి కాదని పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇది పూర్తిగా విరుద్దమంటూ తెలిపారు. కేసును విచారించిన కోర్టు ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. 14 రోజులు ఎలా పెంచుకునేందకు అనుమతి ఇస్తారంటూ సీరియస్ అయ్యింది. చివరకు టికెట్ ధరల పెంపును కేవలం 10 రోజులకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించని ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కోర్టు.