NEWSNATIONAL

యుద్ద ప్రాతిప‌దిక‌న కొలువుల భ‌ర్తీ – సీఎం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన భ‌గ‌వంత్ మాన్

పంజాబ్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తమ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన విధంగా ద‌శ‌ల వారీగా కొలువుల‌ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. బుధ‌వారం సీఎం నివాసంలో 1158 మంది అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, లైబ్రేరియ‌న్ల‌తో కూడిన ప్ర‌తినిధి బృందం భ‌గ‌వంత్ మాన్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకుంది.

ఇటీవ‌ల కోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వీరికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా తీర్పు చెప్పింది. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం ఉద్యోగం క‌ల్పించేందుకు కృషి చేస్తుంద‌ని ఈ సంద‌ర్బంగా సీఎం త‌ర‌పున న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు.

ఈ సంద‌ర్బంగా త‌మ‌కు అనుకూలంగా కోర్టు తీర్పు రావ‌డంలో మ‌ద్ద‌తు తెలియ చేసినందుకు గాను ప్రొఫెస‌ర్స్, లైబ్రైరియ‌న్ల బృందం ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపింది.

ఇదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా తాము ప‌డిన ఇబ్బందుల గురించి కూడా సీఎంతో ఏక‌రువు పెట్టారు. ఈ సంద‌ర్బంగా సీఎం భ‌గ‌వంత్ మాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తినిధి బృందానికి పూర్తి భరోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ కోర్టు చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.