NEWSTELANGANA

మ‌హిళా మోర్చా చీఫ్ గా శిల్పా రెడ్డి

Share it with your family & friends

బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాయ‌కురాలు

హైద‌రాబాద్ – డాక్ట‌ర్ గా , రాజ‌కీయ నాయ‌కురాలిగా, ప్రజా సేవ‌కురాలిగా గుర్తింపు పొందారు డాక్ట‌ర్ శిల్పా సునీల్ రెడ్డి. వృత్తి రీత్యా వైద్యురాలైన‌ప్ప‌టికీ ముందు నుంచీ సేవా భావం క‌లిగి ఉన్నారు. ప్ర‌త్యేకించి భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల ప‌ట్ల గౌర‌వం . దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

తాజాగా బీజేపీ హై క‌మాండ్ డాక్ట‌ర్ శిల్పా రెడ్డి చేసిన సేవ‌లు, పార్టీ ప‌ట్ల అంకిత భావం క‌లిగి ఉండ‌డాన్ని గుర్తించింది. కీల‌క‌మైన ప‌ద‌విని అప్ప‌గించింది. ఈ మేర‌కు రాష్ట్ర మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిగా శిల్పా రెడ్డిని నియ‌మించింది. ఈ సంద‌ర్బంగా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా, ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, రాష్ట్ర చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి, మాజీ చీఫ్ బండి సంజ‌య్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు శిల్పా సునీల్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిగా పార్టీ కార్యాల‌య‌లో ఇవాళ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ మేర‌కు సంత‌కం చేశారు. ఆమెను ప‌లువురు నేత‌లు , నాయ‌కురాళ్లు అభినందించారు.