NEWSANDHRA PRADESH

ల‌డ్డూ ప్ర‌సాదం సీఎం రాజ‌కీయం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కొడాలి నాని

అమ‌రావ‌తి – ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సీరియ‌స్ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయ‌న‌కు ప‌నీ పాటా లేకుండా పోయింద‌న్నారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక ప్ర‌స్తుతం ప్ర‌సిద్ద ఫుణ్య క్షేత్రం తిరుమ‌ల‌ను అప్ర‌తిష్ట పాలు చేసేందుకు పూనుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కొడాలి నాని బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కొడాలి నాని.

ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అత్యంత భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో చేస్తార‌ని, ఎక్క‌డా క‌ల్తీ జ‌రిగేందుకు ఆస్కార‌మే లేద‌న్నారు. ఈ విష‌యాన్ని ఈవో టీటీడీ శ్యామ‌ల రావు చెప్పినా ప‌ట్టించు కోకుండా జ‌గ‌న్ రెడ్డిని, వైసీపీని బ‌ద్నాం చేసేందుకు చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ పూను కోవ‌డం దారుణ‌మ‌న్నారు మాజీ మంత్రి.

గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వ‌ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించామ‌న్నారు.

గ‌త‌ జులై 17న ఒక ట్యాంకర్‌లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపడం జరిగింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడ లేద‌ని ఈవో స్ప‌ష్టం చేశార‌ని, అయినా రాజ‌కీయం చేయ‌డం దారుణ‌మ‌న్నారు కొడాలి నాని.