రేపే సీఎం చంద్ర‌బాబు పుట్ట‌ప‌ర్తికి రాక‌

22,23వ తేదీల‌లో ముఖ్య‌మంత్రి టూర్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పుట్ట‌ప‌ర్తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 22, 23 తేదీల‌లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు సీఎస్ విజ‌యానంద్. 22 తేదీ శ‌నివారం ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళ‌తారు సీఎం. 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలుకుతారు. ఉద‌యం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ముర్ము ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలుకుతారు నారా చంద్ర‌బాబు నాయుడు. అనంతరం 3.50 గంటలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం ప‌లుకుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతితో కలిసి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు నారా చంద్రబాబు నాయుడు. 23 తేదీ ఆదివారం 9 గంటలకు శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయల్దేరి మద్యాహ్నం 1 గంటకు ఉండవల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి చేరుకుంటార‌ని సీఎస్ వెల్ల‌డించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *