Friday, 16 October 2026

పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

newsseals-UttamKumar

హైద‌రాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వివిధ అంశాలకు సంబంధించిన సవరించిన అంచనాలను పరిశీలించేందుకు, నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టులోని పలు అంశాల పరిధిని విస్తరించడం, సమగ్ర సాంకేతిక పరిశీలనల ఆధారంగా అదనపు పనులను చేర్చడం, ప్రారంభ పరిపాలనా అనుమతులు మంజూరైనప్పటి నుండి పన్ను విధానంలో వచ్చిన మార్పుల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడం వంటి కారణాల దృష్ట్యా ఈ సవరణ అవసరమైంది.

ఈ ఇద్దరు నాయకులు నీటి పారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రతిపాదనలను క్షుణ్ణంగా సమీక్షించారు. ప్ర‌తిపక్షాలు కావాల‌ని చేస్తున్న ఆరోప‌ణ‌లు త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో నీటి పారుద‌ల రంగంలో అంతులేని అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సీన్ మార్చేశామ‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేత‌ల‌కు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క . త్వ‌ర‌లోనే దేవాదుల ఎత్తిపోత‌ల ప్రాజెక్టు ప‌నుల‌ను ప్రారంభిస్తామ‌న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *