అప్రెంటీస్ కోసం టీఎస్ఆర్టీసీ ఆహ్వానం
మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పిలుపు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తీపి కబురు చెప్పారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు వీసీ సజ్జనార్. ఐటీఐ విద్యను అభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ సువర్ణ అవకాశం అందిస్తోందని స్పష్టం చేశారు ఎండీ.
హైదరాబాద్ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు.
ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్షిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోందని తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ లోపు సంబంధిత సంస్థ ఆర్టీసీకి చెందిన వెబ్ సైట్ https://iti.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏడాదికి ఫీజు కింద రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఎండీ.