ENTERTAINMENT

తార‌క్ విశ్వరూపం దేవ‌ర విజ‌యం

Share it with your family & friends

మ‌రోసారి కొర‌టాల శివ మూవీ మార్క్

హైద‌రాబాద్ – తార‌క్ ద‌మ్మున్నోడు. న‌ట‌న‌లోనే కాదు డైలాగులు పేల్చ‌డంలో త‌న‌కు త‌నే సాటి. ఇప్ప‌టికే క‌సి మీద ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందుకోసం డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌ర ఇప్పుడు దుమ్ము రేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోయేందుకు సిద్దంగా ఉంది.

త‌మిళ సినీ రంగానికి చెందిన టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన సంగీతం, సినిమాకు సంబంధించిన డైలాగులు పేలుతున్నాయి. ఇక అందాల ముద్దుగుమ్మ జాహ్నవి క‌పూర్ , సైఫ్ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించినా సినిమా మొత్తం జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు కొరటాల శివ‌.

ఇప్ప‌టికే దేవ‌ర మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైల‌ర్స్ , పాట‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ త‌ర‌లి వ‌చ్చారు. దేవ‌ర చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానున్న ఈ మూవీపై ఉత్కంఠ నెల‌కొంది. ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత వ‌స్తున్న దేవ‌ర బిగ్ స‌క్సెస్ కావాల‌ని ఆశిద్దాం.