NEWSNATIONAL

ప‌ద‌వీ విర‌మ‌ణ తీర్మానం మోదీకి వ‌ర్తించ‌దా

Share it with your family & friends

ఆర్ఎస్ఎస్ చీఫ్ భ‌గ‌వత్ కు మాజీ సీఎం లేఖ

ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ద‌వీ విర‌మ‌ణపై నిప్పులు చెరిగారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలో 75 ఏళ్లు దాటిన వాళ్లు త‌ప్పు కోవాల‌ని తీర్మానం చేశార‌ని, మ‌రి ఈ నిబంధ‌న న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీకి వ‌ర్తించ‌దా అని నిల‌దీశారు.

ఈ మేర‌కు గురువారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇందులో భాగంగా అర‌వింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు లేఖ రాశారు. ప్ర‌ధానంగా 75 ఏళ్ల ప‌ద‌వీ విర‌మ‌ణ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

ఎల్‌కే అద్వానీకి వర్తింపజేసినట్లే పదవీ విరమణ వయస్సుపై బీజేపీ నిబంధన మోదీ (75)కి వర్తించ‌దా , రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈడీ (ED), సీబీఐ (CBI ) బెదిరింపులను ఉపయోగించుకునే ప్రధాని మోడీ వ్యూహాలను మీరు అంగీకరిస్తారా అని నిల‌దీశారు అర‌వింద్ కేజ్రీవాల్.

మోడీ “అత్యంత అవినీతి నేత”లను బిజెపిలోకి చేర్చడాన్ని ఆర్ఎస్ఎస్ ( RSS) అంగీకరిస్తుందా అని మండిప‌డ్డారు. ఈ “తప్పు పనులు” చేయకుండా భగవత్ ఎప్పుడైనా ప్రధానిని ఆపారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిజెపికి ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని జెపి నడ్డా అన్నప్పుడు మీరెందుకు స్పందించ లేదంటూ ప్ర‌శ్నించారు మాజీ సీఎం.