ఏమిటీ అవతారం ఎందుకింత అయోమయం..?
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన సంచలన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిపై స్పందించారు నటుడు ప్రకాశ్ రాజ్.
దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఓ వైపు ప్రజలు సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఒక్క లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ రాజకీయం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు ప్రముఖ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. తమిళ సినీ నటుడు కార్తీతో పాటు ప్రకాశ్ రాజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అంతే కాదు దేశంలో ఎవరు సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తాను చేసిన ట్వీట్ ఏంటి..పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఏంటీ అంటూ మండిపడ్డారు ప్రకాశ్ రాజ్.
తాజాగా పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే గెలిచే ముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం అంటూ ప్రశ్నించారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా.